తెలంగాణలో చారిత్రాత్మక నిర్ణయం: అక్టోబర్ రెండు నుంచి కొత్త క్యూర్ చట్టం అమలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
తెలంగాణ మున్సిపల్ పాలనలో చారిత్రాత్మక మార్పులు తెస్తూ అక్టోబర్ రెండు నుంచి కొత్త క్యూర్ చట్టాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టాన్ని రద్దు చేసి ఈ కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిద్వారా రాష్ట్రంలోని ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో పారదర్శకమైన, వేగవంతమైన పాలన అందుతుందని పేర్కొన్నారు. ఆస్తి పన్ను విధానంలో మార్పులతో పాటు హైడ్రాకు పూర్తిస్థాయి చట్టబద్ధత లభిస్తుందని స్పష్టం చేశారు.