తీరానికి తీవ్ర తుపాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మురసు తీవ్ర తుపాను తీరం దాటినప్పటికీ ముప్పు ఇంకా పొంచి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు.