ఆఫర్ లేటర్లు ఇచ్చి ఉద్యోగాలివ్వని 22 కంపెనీలపై ఐఐటీల కొరడా

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

ఆఫర్ లెటర్లు ఇచ్చి కూడా విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వని ఇరవై రెండు కంపెనీలపై ఐఐటీలు కఠిన చర్యలు తీసుకున్నాయి. ఐఐటీ గువాహటిలో జరిగిన సమావేశంలో ఆల్ ఐఐటీస్ ప్లేస్మెంట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐపీసీ కన్వీనర్ జాన్ జోస్ తెలిపారు. భవిష్యత్తులో జరిగే ప్లేస్మెంట్ సీజన్లలో ఆయా సంస్థలకు సహకరించబోమని స్పష్టం చేశారు. దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ ఒరాకిల్తో పాటు పలు అంకుర సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.