పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు: ఇరాన్‌పై దాడులకు అమెరికా రంగం సిద్ధం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అంతర్జాతీయం
అమెరికాలో జరిగే మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్‌పై కొత్తగా సైనిక దాడులు చేసే అవకాశం ఉందని దౌత్యవేత్తలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలోని మిత్రదేశాలు అప్రమత్తంగా ఉండాలని అగ్రరాజ్యం హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఈ సరికొత్త సైనిక చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, దాడులకు ఆదేశాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారని దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.