వీరుడికిచ్చిన హామీలు నెరవేర్చకుంటే శౌర్య చక్ర వెనక్కి తీసుకోండి!
రిపోర్టర్: గోపి
స్థలం: లక్నో
మణిపూర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన అసిస్టెంట్ కమాండెంట్ వివేక్ సక్సేనా తల్లి సావిత్రి సక్సేనా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 22 ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇచ్చిన భూమి, ఇతర హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో తన కుమారుడికి మరణానంతరం లభించిన శౌర్య చక్రను వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతికి, సీఎంకు విజ్ఞప్తి చేశారు.