మృతుడు ఎడ్ల శేఖర్ కుటుంబానికి మిత్ర యూత్ ఆర్థిక సాయం
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
ఇటీవల మృతి చెందిన ఎడ్ల శేఖర్ కుటుంబానికి మిత్ర యూత్ ఆధ్వర్యంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. మంగళవారం కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా శేఖర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిత్ర యూత్ గౌరవ సలహాదారుడు పురుగుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.