కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఏఏఐ బృందం పరిశీలన

రిపోర్టర్: నరేష్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సాంకేతిక బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో భూ లభ్యత, భౌగోళిక పరిస్థితులను నిపుణులు పరిశీలిస్తున్నారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాలతో కనెక్టివిటీ మెరుగుపడనుంది.