న్యాయవాదిపై దాడిని ఖండించిన సంఘం: నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

న్యాయవాది మల్లికార్జునపై జరిగిన దాడిని ఖండిస్తూ న్యాయవాదులు కోర్టు ఆవరణ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన చేపట్టారు. వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వారిపై దాడి అభ్యంతరకరమని, నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.