రాజ్యాంగాన్ని మంటగలుపుతున్న కేంద్ర ప్రభుత్వ కర్కశ వైఖరి

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తోందని తీవ్రంగా విమర్శించారు. సెప్టెంబర్ 17 వేడుకల పేరుతో పాలక పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, ఇది బహుజనులకు అన్యాయం జరిగిన రోజని మండిపడ్డారు. బహుజనులు రాజ్యాధికారం సాధిస్తేనే నిజమైన ఫలాలు అందుతాయన్నారు. అంబేద్కర్ ను కించపరిచేలా పుస్తకం రాసినా ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం శోచనీయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.