సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని రైతు సంఘం డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఏన్కూరు

ఏన్కూరులో జరిగిన సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్ మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంతో పంటలు దెబ్బతింటున్నాయని, తాగు సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఏన్కూరు మండలాన్ని కరువు జాబితాలో చేర్చి నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఆయన స్పష్టం చేశారు.