సీతారాంపురంలో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం
రిపోర్టర్: SYAM
స్థలం: సీతారామపురం
సీతారాంపురం శ్రీ శక్తి భవనంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పదిమంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంఈఓ మస్తాన్వలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని వక్తలు కొనియాడారు.
సమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని, బాధ్యతాయుతమైనదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రాజశేఖర్, ఎంపీటీసీ అల్లు రాజుతో పాటు మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.