ఈసీ నిర్ణయంపై శశి థరూర్ నిప్పులు: ఓటర్ల తొలగింపు అసంబద్ధమని ధ్వజం
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
ఓటర్ల జాబితా నుండి కోట్లాది పేర్లను తొలగించడం ద్వారా ఎన్నికల సంఘం ప్రజల రాజ్యాంగ హక్కులను హరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ రాజధానిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పదమూడు కోట్ల మంది ఓటర్లను తొలగించడం పూర్తిగా అన్యాయమని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ లీలా మైదాన్ వేదికగా సాగిన ఈ కార్యక్రమంలో విపక్ష నేతలు కూడా ఈసీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.