'రోడ్డు ప్రమాదాల నివారణకు ఏఐ సాంకేతికత': విశాఖ పోలీస్ శాఖకు స్పీడ్ లేజర్ గన్స్ అందజేత

రిపోర్టర్: వెంకట్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలో రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియంత్రణ కొరకు సీఎస్ఆర్ నిధులతో మూడు అత్యాధునిక స్పీడ్ లేజర్ గన్స్ ను విశాఖ నగర పోలీస్ శాఖకు అందజేశారు. అదానీ గంగవరం పోర్ట్ మరియు సౌత్ ఏషియా ఎల్పీజీ కంపెనీల సౌజన్యంతో వీటిని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చేతుల మీదుగా స్వీకరించారు. నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై ఏఐ ఆధారంగా రియల్ టైంలో కాంటాక్ట్ లెస్ పద్ధతిలో చలానాలు విధించి ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.