కర్నూలులో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్: సరైన పత్రాలు లేని ఇరవై మూడు వాహనాలు స్వాధీనం
రిపోర్టర్: విజయ్
స్థలం: కర్నూలు
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మాచాపురం గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు కర్నూలు పోలీస్ శాఖ వెల్లడించింది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎటువంటి సరైన ధ్రువపత్రాలు మరియు రికార్డులు లేని మొత్తం ఇరవై మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేస్తూ అధికారులు వివరాలు వెల్లడించారు.