పుల్లంపేటలో మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా ఘనంగా రక్తదాన శిబిరం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పుల్లంపేట

తిరుపతి జిల్లా పుల్లంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు మనోహర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెంగల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు.