'దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి': భూభారతిపై సీఎంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

అమెరికాను కనుక్కోబోయి ఇండియాకి వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి తీరు మారిందని బీఆర్ఎస్ మండిపడింది. ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలతో దొరికిన దొంగలాగే, ఇవాళ భూ భారతిని భూహారతి చేసి రేవంత్ రెడ్డి మళ్లీ దొరికిపోయారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రజల భూములను కబ్జా చేసే కుట్రలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.