మంగళగిరిలో ఘనంగా నూతన పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్
రిపోర్టర్: శివ
స్థలం: అనకాపల్లి
మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో 2025-26 బ్యాచ్‌కు చెందిన 149 మంది నూతన పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. కఠిన శిక్షణ పూర్తి చేసుకుని ప్రజాసేవలోకి అడుగుపెడుతున్న నూతన కానిస్టేబుళ్ల క్రమశిక్షణ, నైపుణ్యాలను చూసి గర్వంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రజల భద్రత కోసం వారు అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.