స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు పిలుపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమృతలూరు

వేమూరులోని లక్ష్మీ కల్యాణ మండపంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి జిల్లా పరిశీలకులు జంగా కృష్ణమూర్తి, బాపట్ల జిల్లా అధ్యక్షుడు సలగల రాజశేఖర్బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామస్థాయిలో కూటమి సమన్వయంతో సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వారు దిశానిర్దేశం చేశారు.