ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన ముగ్గురు భారతీయ టెక్ నిపుణులు
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఓపెన్ ఏఐని ముగ్గురు భారతీయ టెక్ పరిశోధకులు హ్యాక్ చేసి సంచలనం సృష్టించారు. సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ హ్యాక్ ట్రాన్ ఏఐకు చెందిన హర్ష్ జైశ్వాల్, మోహన్ పెదపాటి, రాహుల్ మైనీలు ఓపెన్ ఏఐ నిర్వహించిన బగ్ బౌంటీ ప్రోగ్రామ్ లో పాల్గొని ఈ ఘనత సాధించారు. 72 గంటల పాటు శ్రమించి ఓపెన్ ఏఐ ప్రైవేట్ రిపాజిటరీలో బగ్ ను గుర్తించి యాక్సెస్ చేయడంతో ఆ సంస్థ ఈ లోపాన్ని సరిదిద్దుకుని వారికి 6,500 డాలర్ల రివార్డు అందజేసింది. వీరిలో తెలుగు రాష్ట్రానికి చెందిన మోహన్ పెదపాటి రాజమహేంద్రవరం సమీపంలోని కొండగుంటూరుకు చెందినవారు కావడం విశేషం.