స్పెర్రీ కంపెనీలో మెగా గంజాయి నిర్ధారణ పరీక్షలు

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సత్యవేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పెర్రీ కంపెనీలో మంగళవారం మెగా గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పుత్తూరు డీఎస్పీ రవికుమార్, సత్యవేడు సీఐ మురళి పర్యవేక్షణలో సుమారు 60 మంది ఉద్యోగులకు డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ సందర్భంగా డీఎస్పీ ఉద్యోగులకు మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పించి చట్టపరమైన హెచ్చరికలు జేశారు.