చైనా, అమెరికాల మధ్య ఏఐ రంగంలో తీవ్ర పోటీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
కృత్రిమ మేధ రంగంలో చైనా సాధిస్తున్న వేగవంతమైన పురోగతిని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసించారు. అమెరికా, చైనాలు ఏఐ టాలెంట్, కంప్యూటింగ్ పవర్ కోసం 'సూపర్ పోటీ'లో ఉన్నాయని ఆయన తెలిపారు. పేద దేశాలకు ఏఐ టూల్స్ అందించేందుకు గాను రెండు దేశాలు తమ డేటా సెంటర్ కంప్యూటింగ్ పవర్ లో 5 శాతం కేటాయించాలని బిల్ గేట్స్ కీలక ప్రతిపాదన చేశారు.