అసాధారణ ధైర్యసాహసాలతో ప్రాణాలు కాపాడిన పైలట్ స్మిత్ మచ్ఛర్

రిపోర్టర్: సునీల్ స్థలం: Andhra Pradesh / Telangana

గాలిలో విమానంపై దాడి జరిగి కత్తిపోట్లకు గురైనప్పటికీ అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తెగువ ఎంతో స్ఫూర్తిదాయకమని విజయసాయి రెడ్డి ప్రశంసించారు. ఊహించని ప్రమాదం ముంచుకొచ్చిన వేళ ఆయన చూపిన సమయస్ఫూర్తి వల్ల నూట డెబ్బై నాలుగు మంది ప్రాణాలు దక్కాయని పేర్కొన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ విమానం కూలిపోకుండా ప్రాణాలకు తెగించి పోరాడిన ఆ పైలట్ సాహసం దేశం గర్వించదగ్గదని విజయసాయి రెడ్డి కొనియాడారు.