రాజాపేట మండలం బంటుగూడెంలో ఆరుగురికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రమైన బంటుగూడెం వాసులు ఆరుగురికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గొల్లైన స్వామి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లబ్ధిదారులకు పత్రాలు అందజేయడం సంతోషకరమని పేర్కొంటూ, ఇందుకు కృషిచేసిన పిఏసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.