లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి, 1100 టన్నుల పేలుళ్లు

రిపోర్టర్: మహేష్ స్థలం: World

దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం అత్యంత భీకరమైన వైమానిక దాడి నిర్వహించింది. అలీ-అల్ తాహెర్ కొండ ప్రాంతంలో హెజ్బొల్లా భూగర్భ నెట్‌వర్క్, టన్నెల్స్‌ను ధ్వంసం చేయడానికి ఏకంగా 1,100 టన్నుల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఈ భారీ పేలుళ్ల కారణంగా దక్షిణ లెబనాన్‌లో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.