మున్సిపల్ ఎన్నికల వేడి: రాష్ట్రంలో ముమ్మరంగా ఏర్పాట్లు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో పదమూడు నగర పాలక సంస్థలు మరియు ఎనభై ఏడు పురపాలక సంఘాల్లోని మూడు వేల తొమ్మిది వందల నార్భై రెండు వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లోని సుమారు కోటీ మూడు లక్షల మంది ఓటర్లు మేయర్లు, ఛైర్పర్సన్లు, కార్పొరేటర్లు మరియు వార్డు సభ్యుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఈ ఎన్నికల కోసం పన్నెండు వేల రెండు వందల నలభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.