బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధికి ఇరవై రెండు కోట్ల నిధులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.22 కోట్ల భారీ నిధులను కేటాయించింది. ఈ నిధుల కేటాయింపు పట్ల కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.