ఇళ్లు మంజూరు చేయాలని బచ్చన్నపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరుపేదల ఆందోళన

రిపోర్టర్: రాజేష్ స్థలం: జనగామ

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన నిరుపేద మహిళలు తమకు ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పద్మ శ్రీలత, బాదం రేణుకల ఆధ్వర్యంలో బాధితులు మాట్లాడుతూ పదేళ్లుగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నా అధికారుల నిర్లక్ష్యంతో తుది జాబితాలో తమ పేర్లు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వర్షానికే ఇళ్లలోకి నీరు చేరి రాత్రంతా జాగారం చేయాల్సి వస్తోందని వాపోయి, కలెక్టర్ స్పందించి ఆదుకోవాలని వేడుకున్నారు.