ఏపీలో మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

ఏపీలో మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునఃప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవించే తల్లులు, నవజాత శిశువులకు ఈ కిట్లను ఉచితంగా అందజేయనున్నారు. ఒక్కో కిట్ విలువ రూ.1,410గా ఉండగా, ఏడాదికి రూ.51.2 కోట్లు వెచ్చిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.