సియస్ఆర్ పేటలో జనసేన అభ్యర్థుల ముమ్మర ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: వీరఘట్టం
వీరఘట్టం మండలంలోని సియస్ఆర్ పేట గ్రామంలో జనసేన పార్టీ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి జోరుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక జెడ్పీటీసీ అభ్యర్థి ఉదయాన ఉదయ్ భాస్కర్, ఎంపీటీసీ అభ్యర్థి రౌతు మౌళి గ్రామస్థులను కలుసుకుని గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని నాయకులు తెలిపారు.