జనగాం జిల్లాలో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక శిక్షణ ప్రారంభించిన కలెక్టర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: జనగాం

జనగాం జిల్లాలో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక తయారీ, అమలుపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమలు, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని ప్రణాళికా విధానాలపై అవగాహన కల్పించుకున్నారు.