గ్రూప్-వన్ మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగాయని హైకోర్టులో లాయర్ల వాదన
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-వన్ జవాబుపత్రాల మూల్యాంకనంలో ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. సిట్ నివేదిక ద్వారా మూల్యాంకనం నిష్పక్షపాతంగా జరగలేదని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ మూల్యాంకనంతో పోలిస్తే మాన్యువల్ మూల్యాంకనంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, తెలుగు మాధ్యమ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని న్యాయవాదులు తెలిపారు. ఓఎమ్ఆర్ షీట్లలో దిద్దుబాట్లు, ఓవర్ రైటింగ్స్ ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వాదనల కొనసాగింపు కోసం విచారణ బుధవారానికి వాయిదా పడింది.