కలతూరులో మూడేళ్ల భూ సమస్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలం కలతూరు గ్రామంలో మూడేళ్లుగా సాగుకు నోచుకోని భూములకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన కలెక్టర్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డితో పాటు కృషి చేసిన సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ కూరపాటి శంకర్ రెడ్డి, మండల అధ్యక్షులు మునిస్వామి యాదవ్ కు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.