కృత్రిమ మేధ పదానికి బదులుగా సూపర్ ఇంటెలిజెన్స్ శకానికి నాంది పలికిన ట్రంప్

రిపోర్టర్: గోపి స్థలం: అమెరికా

అమెరికా ప్రభుత్వ అధికారిక వ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదానికి బదులుగా సూపర్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఉపయోగించాలని ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసినట్లు వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. వైట్హౌస్లో టెక్ దిగ్గజాలతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫెడరల్ ప్రభుత్వంలోని అన్ని ఎగ్జిక్యూటివ్ విభాగాలు ఇకపై ఎస్ఐ పదాలనే అధికారిక కమ్యూనికేషన్లలో ఉపయోగించాలని స్పష్టం చేశారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల కారణంగానే 70 ఏళ్ల నాటి పదాన్ని మారుస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం వివరించింది.