యుఎస్‌కు పంపిన గిఫ్ట్ పార్శిల్‌ను ధ్వంసం చేసిన కొరియర్ సంస్థ
రిపోర్టర్: రాజేష్
స్థలం: తమిళనాడు
అమెరికాలో ఉన్న కూతురు కోసం పంపిన బహుమతుల పార్శిల్‌ను డెలివరీ చేయకుండా ధ్వంసం చేసిన మూడు కొరియర్ కంపెనీలు బాధితుడికి రూ.41,090 చెల్లించాలని తమిళనాడు జిల్లా కన్స్యూమర్ కమిషన్ ఆదేశించింది. సేవలందించడంలో వైఫల్యం, అనుచిత వ్యాపార సరళి కింద ఈ తీర్పు వెలువడింది. గరుడవేగ ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా సెప్టెంబర్ 6న ఈ పార్శిల్ బుక్ చేయగా, సరైన సమాచారం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని కమిషన్ ప్రెసిడెంట్ టి.శేఖర్, మెంబర్ జె.ఎస్.సెంథిల్‌కుమార్ స్పష్టం చేశారు.