కర్ణాటకలో కోతి దాడిలో ప్రముఖ రచయిత భార్య మృతి

రిపోర్టర్: శివ స్థలం: కర్ణాటక

కర్ణాటకలోని కొప్పళలో కోతి దాడి చేసి కింద పడేయడంతో 91 ఏళ్ల వృద్ధురాలు నజామున్నిసా బేగం మృతి చెందారు. బీటీ పాటిల్ నగర్ లోని తన ఇంట్లో నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందారు. ప్రముఖ రచయిత ఎం.ఎస్. సవదట్టి భార్య అయిన ఆమెపై జరిగిన ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.