పౌరాణిక చిత్రాలపై ఎస్.ఎస్.రాజమౌళి సంచలన వ్యాఖ్యలు: వారణాసిపై భారీ అంచనాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

తెలుగు తెరపై వచ్చిన పౌరాణిక చిత్రాల విషయంలో తాను ఎప్పుడూ సంతృప్తి చెందలేదని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పష్టం చేశారు. ఓ పాడ్కాస్ట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతిహాసాలను రాసిన విధానానికీ, తెరపైకి తెచ్చిన విధానానికీ చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఆ లోటే తనను చాలా రోజులు బాధించిందని తెలిపారు. ఈ సవాలుతోనే తాను వారణాసి చిత్రంలో కొంత భాగం రామాయణాన్ని తెరకెక్కించానని రాజమౌళి వెల్లడించారు.