ఎస్ ఉప్పరపల్లిలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన కూటమి నేతలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రైల్వే కోడూరు

రైల్వేకోడూరు మండలంలోని ఎస్. ఉప్పరపల్లి గ్రామంలో నియోజకవర్గ ఇన్చార్జి ముక్కా రూపానంద రెడ్డి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.