ముంబైలో ఘనంగా రామాయణం ప్రీమియర్: హాజరైన ప్రముఖ బాలీవుడ్ నటులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ముంబై

రణ్బీర్ కపూర్ నటించిన రామాయణం సినిమా ప్రీమియర్ ముంబై నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ ప్రత్యేక వేడుకకు ఆలియా భట్, సన్నీ డియోల్, నీతూ కపూర్ లతో పాటు పలువురు ప్రముఖ బాలీవుడ్ నటులు హాజరై సందడి చేశారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చలనచిత్రం మొదటి భాగం వచ్చే ఏడాది నవంబర్ ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని సినీ వర్గాలు స్పష్టం చేశాయి.