విజయ్ లండన్ పర్యటనపై ఎడప్పాడి పళనిస్వామి తీవ్ర విమర్శలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తమిళనాడు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ లండన్ పర్యటన పెట్టుబడుల కోసం కాదని, మోటార్ రేస్ జెండా ఊపడానికేనని AIADMK ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం సొంత కాళ్లపై నిలబడలేదని, అప్పు తెచ్చిన కాళ్లపై నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను విస్మరించి సోషల్ మీడియా రీల్స్పైనే ప్రభుత్వం ఆధారపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.