మెదక్ జిల్లాలో అమిత్ షా పర్యటన మరియు అమూల్ యూనిట్ శంకుస్థాపన

రిపోర్టర్: శివ స్థలం: మెదక్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ నాలుగో తేదీన తెలంగాణలోని మెదక్ జిల్లాలో అధికారికంగా పర్యటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి ప్రాంతంలో అమూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే భారీ మిల్క్ బల్క్ యూనిట్ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించబోయే రైతు బహిరంగ సభలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.