సినిమా కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న అవమానాలపై అమితాబ్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: సునీల్
స్థలం: ముంబై
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కేబీసీ షోలో వెల్లడించారు. ఎత్తు ఎక్కువగా ఉండటం, ముఖం చిన్నగా ఉండటం వల్ల నిర్మాతలు తనను పక్కన పెట్టేవారని తెలిపారు. ముఖం పెద్దదిగా కనిపించడం కోసమే జుట్టు పెంచి, చెంపల వరకు పెంచుకున్నట్లు అమితాబ్ బచ్చన్ సరదాగా గుర్తుచేసుకున్నారు. ఈ ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.