షమీకి జట్టులో చోటు దక్కకపోవడానికి వయసు కారణం కాదు!

రిపోర్టర్: మహేష్ స్థలం: India

భారత పేసర్ మహ్మద్ షమీకి జాతీయ జట్టులో చోటు దక్కకపోవడానికి వయసు కాకుండా ఫిట్‌నెస్, గాయాలే కారణమని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలాంటి సీనియర్లు ఆడుతున్నప్పుడు వయసు ఎలా కారణమవుతుందని ప్రశ్నించారు. షమీ రీఎంట్రీలో వేగం, పాత తీవ్రత కనిపించలేదని, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌కు షమీకి చాలా తేడా ఉందని ఆయన పేర్కొన్నారు.