సీబీఎస్ఈ 2027 బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్లపై కీలక నోటీసు విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: India

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి సీబీఎస్ఈ 2027 బోర్డు పరీక్షలకు సంబంధించి కీలక నోటీసు జారీ చేసింది. 9, 11 తరగతుల రిజిస్ట్రేషన్లు, 10, 12 తరగతుల విద్యార్థుల జాబితా సమర్పణ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. విద్యార్థుల వివరాల్లో తప్పులు దొర్లకుండా ముందస్తుగా సరిచూసుకోవాలని పాఠశాలలను సీబీఎస్ఈ అప్రమత్తం చేసింది.