ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయంపై కిషన్ రెడ్డి హర్షం

రిపోర్టర్: సతీష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికలలో ఏబీవీపీ సాధించిన ఘన విజయం పట్ల కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు విద్యార్థుల నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. సేవ, నిబద్ధత, దేశ ప్రథమ సిద్ధాంతాలపై విద్యార్థులకు ఉన్న విశ్వాసాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తోందని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా విజేతలైన కార్యకర్తలందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.