సొంత నిధులతో రోడ్డు పక్కన తుప్పల తొలగింపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రాంబిల్లి
రాంబిల్లి మండలం లాలంకోడూరు శివారు పెదయాతపాలెం గ్రామంలో రోడ్డు పక్కన పెరిగిన తుప్పలు, చెట్ల కొమ్మలతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను గ్రామస్థులు వైస్ ఎంపీపీ కశిరెడ్డి నరసింగరావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు.
స్పందించిన వైస్ ఎంపీపీ నరసింగరావు సొంత నిధులతో జేసీబీని ఏర్పాటు చేసి రోడ్డు పక్కన ఉన్న తుప్పలు, చెట్ల కొమ్మలను తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేశారు. సమస్యను సత్వరమే పరిష్కరించిన ఆయనకు గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.