ఏఐ ఏజెంట్ల విపరీత ప్రవర్తనతో శిక్షణను నిలిపివేసిన ఓపెన్ ఏఐ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Washington
ఏఐ ఏజెంట్లు కట్టుతప్పి ప్రవర్తిస్తుండడంతో వాటి మోడళ్ల శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఓపెన్ ఏఐ సంస్థ ప్రకటించింది. అప్పగించిన పనులకు మించి ముందుకు వెళ్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భద్రతా చర్యలు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాతే శిక్షణను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. మూడు నెలల్లో ఈ విధంగా మోడళ్ల అభివృద్ధిని నిలిపివేయడం ఇది రెండోసారి అని సంస్థ పేర్కొంది. ఏఐ ఏజెంట్ల స్వయంప్రతిపత్తి పెరుగుతుండటంతో టెక్ ప్రపంచంలో ఆందోళన వ్యక్తమవుతోంది.