'బంగ్లాదేశ్‌కు మరో విడత డీజిల్ సరఫరా': భారత్ కీలక నిర్ణయం

రిపోర్టర్: గోపి స్థలం: భారత్

బంగ్లాదేశ్‌లో ఇంధన డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత్ మరో విడతగా సుమారు నాలుగు వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను సరఫరా చేసింది. భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ద్వారా దినజ్‌పూర్‌లోని పార్బతిపూర్ రిసీవింగ్ టెర్మినల్ డిపోకు ఈ ఇంధనం చేరుకుందని ఆపరేషన్ మేనేజర్ మొహమ్మద్ రొబియుల్ ఆలం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హయాంలో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ ఇంధన సరఫరా కొనసాగుతోంది.