వలస కూలీని వరించిన అదృష్టం పంజాబ్‌లో మూడు కోట్ల లాటరీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: పంజాబ్
పొట్టకూటి కోసం పశ్చిమ బెంగాల్ నుంచి పంజాబ్‌కు వలస వెళ్లిన మధు అనే రోజువారీ కూలీ జీవితం ఒక్క గంటలో మారిపోయింది. సిక్కిం ప్రభుత్వం నిర్వహించిన గణేష్ చతుర్థి బంపర్ లాటరీలో భాగంగా డ్రా తీయడానికి గంట ముందు మధు కొనుగోలు చేసిన టికెట్‌కు ఏకంగా రూ. 3 కోట్ల ప్రథమ బహుమతి దక్కింది. ఫగ్వారా సమీపంలోని బంగా ప్రాంతంలో సాగర్ లాటరీ స్టాల్‌లో ఈ టికెట్‌ను కొనుగోలు చేయగా, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.