ఢిల్లీలో ఘోర ప్రమాదం: మహీంద్రా థార్ ఢీకొని ఇద్దరు మృతి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: New Delhi
ఢిల్లీ కంటోన్మెంట్లో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు NDMC ఉద్యోగులు సుఖ్బీర్, అంజు మృతి చెందారు. వేగంగా వచ్చిన మహీంద్రా థార్ వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. నిందితుడు భూపేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.