అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్లకు షాక్: గువామ్ స్థానంలో డెమోక్రాట్ల ఘన విజయం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Washington

అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీకి తొలి ఎదురుదెబ్బ తగిలిందని అనధికారిక ఫలితాలు వెల్లడించాయి. గువామ్ ప్రతినిధి రేసులో డెమోక్రాట్ అభ్యర్థి అలిసియా గ్యారిడో లిమ్టియాకో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రిపబ్లికన్ అభ్యర్థి జేమ్స్ మోయ్లాన్ పై ఆమె గెలుపొందడం ద్వారా డెమోక్రాట్లు ముందంజలో నిలిచారు. అయితే, గువామ్ గవర్నర్ రేసులో రిపబ్లికన్ అభ్యర్థి టోనీ అడా విజయం సాధించడం పట్ల డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.